June 12, 2013
ఛలో అసెంబ్లీకి టీడీపీ సంపూర్ణ మద్దతు
హైదరాబాద్ : ఈ నెల 14న టీ జేఏసీ తలపెట్టబోయే ‘ఛలో అసెంబ్లీ’కి టీడీపీ
సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి
దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై
టీడీపీ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలోనే తెలంగాణ
ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే.. తాము జేఏసీ పిలుపు మేరకో,
టీఆర్‌ఎస్ పిలుపు మేరకో ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం లేదని, తెలంగాణ
ప్రజలకోసమే తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములమౌతున్నామని మోత్కుపల్లి ప్రకటించడం
కొసమెరుపు.
Posted by
arjun
at
7:59 AM