June 5, 2013
పార్టీపై నారా నజర్

తెలుగుదేశం క్షేత్రస్థాయి స్థితిగతుల పై ఆ
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టిసారించా రు. మహానాడు ముగిసిన
వెంటనే ఆయన హైదరాబాద్ జిల్లా పరి ధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా
సమావేశాలు నిర్విహ స్తున్నారు. ప్రతిరోజు రెండు, మూడు నియోజకవర్గాల నేతలతో
మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ
పరిస్థితిని, ప్రత్యర్థి పార్టీల బలాన్ని నేతలను అడిగి తెలుసుకుంటున్నారు.
లోటుపాట్లను సరిచేసుకోవాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. అందరు
కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజలు పార్టీ వైపే ఉన్నారని,
గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని హితబోధ చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ముగిసిన వెంటనే, ఈ నెలలో
లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు
నిర్ణయించారు.
రాష్ర్టంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల
సమీక్షాసమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలని ఆయన
యోచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను గుర్తించేందుకు ఈ
సమావేశాలు దోహదపడుతాయని ఆయన భావిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను ఈసారి
లోక్‌సభ బరిలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే కొన్ని లోక్‌సభ
నియోజకవర్గాలకు ప్రస్తుతం అభ్యర్థుల కొరత పార్టీని వేధిస్తున్న ట్లు
తెలుస్తోంది. కొంతమంది సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేయ డానికి ఆసక్తి
చూపుతూ, లోక్‌సభ బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. సీనియర్లు
పోటీ చేయడానికి అశక్తత వ్యక్తం చేస్తున్న స్థానాల్లో, కొత్త అభ్యర్థులను
అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ సమీక్షా సమావేశాల సందర్భంగా
పార్టీ అభ్యర్థుల పేర్లను పరిశీలించే అవకాశాలు లేకపోలేదం టున్నారు. పోటీ
చేసేందుకు ఆసక్తి ప్రదర్శించేవారి స్థితిగతులు, పార్టీలో, ప్రజల్లో
వారికున్న గుర్తింపును పరిశీలించే అవకాశ ముందన్నారు.
ఈ సమావేశాలకు
ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా
వ్యవహరిస్తున్న నేతలను, పొలిట్‌బ్యూరో సభ్యులను, జిల్లా అధ్యక్షులను,
స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆహ్వానించనున్నట్లు పార్టీ
వర్గాలు తెలిపాయి. లోక్‌సభ సమీక్షా సమావేశాల అనంతరం ఆరు జిల్లాల్లో
చంద్రబాబు బస్సుయాత్ర ప్రారంభమవుతుందన్నా రు. ఇప్పటికే ‘వస్తున్నా..మీకోసం’
పేరిట చంద్రబాబు 208 రోజుల పాటు 2817 కిమీ మేర పాదయాత్ర నిర్వహించిన విషయం
తెలిసిందే. అయితే పాదయాత్ర కొనసాగించని శ్రీకా కుళం, విజయనగరం, నెల్లూరు,
ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో జులై మొదటి వారంలో బస్సుయాత్ర
చేపట్టనున్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న
అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులను భర్తీ చేయాలని ఆయన యోచిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తాంగా 70 అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఇన్‌చార్జి నియమించాల్సి
ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
దీనికితోడు కొన్ని
నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్‌చార్జి లుగా వ్యవహరిస్తున్న వారు పార్టీ
కార్యక్రమాల పట్ల అంటిము ట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు
వెల్లువెత్తుతుండడంతో, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు
యోచిస్తున్నారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులతో పాటు పార్టీకి
పనిచేయని వారిని తప్పించి కొత్తవారిని నియమిం చేందుకు చంద్రబాబు కసరత్తు
చేస్తున్నారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుండి ముగ్గురు, నలుగురు
పోటీపడుతుండడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు
పేర్కొంటున్నాయి. ఒకరిని కాదని మరొకరికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు
ఎదురయ్యే ప్రమాదముందని గ్రహించిన అధినేత అచితూచి వ్యవహరించాలని
భావిస్తున్నారన్నారు. అయితే ఎవరికీ ఇన్‌చార్జి పదవి కట్టబెట్టినా
మిగతావారందరు కలిసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని గుర్తించాలని నేతలకు హితబోధ
చేస్తున్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని,
గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన నేతలకు, శ్రేణుల్లో
భరోసానింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పార్టీ నుండి కొంతమంది సీనియర్లు
వెళ్లిన స్థానాల్లో యువకులను ప్రోత్సాహించాలని నిర్ణయించారు. దీని ితోడు
రానున్న సాధారణ ఎన్నికల్లో యువకులకు 33 శాతం, బడుగులకు వందసీట్లు ఇచ్చి
ప్రోత్సాహించాలని నిర్ణయించడం తో ప్రజల్లో పార్టీకి కొత్త ఊపు వచ్చిందని
అంచనా వేస్తున్నారు. అ లాగే మహిళలకు, మైనార్టీలకు పెద్దపీట వేయాలని
యోచిస్తు న్నారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చే పనులకు ఎవరు పాల్పడవద్దని
తమ్ముళ్లకు చంద్రబాబు సూచిస్తున్నారు.
తెలుగుదేశం క్షేత్రస్థాయి స్థితిగతుల పై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దృష్టిసారించా రు. మహానాడు ముగిసిన వెంటనే ఆయన హైదరాబాద్ జిల్లా పరి ధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్విహ స్తున్నారు. ప్రతిరోజు రెండు, మూడు నియోజకవర్గాల నేతలతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని, ప్రత్యర్థి పార్టీల బలాన్ని నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. లోటుపాట్లను సరిచేసుకోవాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. అందరు కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజలు పార్టీ వైపే ఉన్నారని, గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని హితబోధ చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ముగిసిన వెంటనే, ఈ నెలలో లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు.
రాష్ర్టంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షాసమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలని ఆయన యోచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను గుర్తించేందుకు ఈ సమావేశాలు దోహదపడుతాయని ఆయన భావిస్తున్నారు. పార్టీలోని సీనియర్లను ఈసారి లోక్‌సభ బరిలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే కొన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రస్తుతం అభ్యర్థుల కొరత పార్టీని వేధిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమంది సీనియర్లు అసెంబ్లీకి పోటీ చేయ డానికి ఆసక్తి చూపుతూ, లోక్‌సభ బరిలోకి దిగేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. సీనియర్లు పోటీ చేయడానికి అశక్తత వ్యక్తం చేస్తున్న స్థానాల్లో, కొత్త అభ్యర్థులను అన్వేషించాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్‌సభ సమీక్షా సమావేశాల సందర్భంగా పార్టీ అభ్యర్థుల పేర్లను పరిశీలించే అవకాశాలు లేకపోలేదం టున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించేవారి స్థితిగతులు, పార్టీలో, ప్రజల్లో వారికున్న గుర్తింపును పరిశీలించే అవకాశ ముందన్నారు.
ఈ సమావేశాలకు ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను, లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న నేతలను, పొలిట్‌బ్యూరో సభ్యులను, జిల్లా అధ్యక్షులను, స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ సమీక్షా సమావేశాల అనంతరం ఆరు జిల్లాల్లో చంద్రబాబు బస్సుయాత్ర ప్రారంభమవుతుందన్నా రు. ఇప్పటికే ‘వస్తున్నా..మీకోసం’ పేరిట చంద్రబాబు 208 రోజుల పాటు 2817 కిమీ మేర పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్ర కొనసాగించని శ్రీకా కుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలో జులై మొదటి వారంలో బస్సుయాత్ర చేపట్టనున్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులను భర్తీ చేయాలని ఆయన యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తాంగా 70 అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఇన్‌చార్జి నియమించాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
దీనికితోడు కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్‌చార్జి లుగా వ్యవహరిస్తున్న వారు పార్టీ కార్యక్రమాల పట్ల అంటిము ట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి పదవులతో పాటు పార్టీకి పనిచేయని వారిని తప్పించి కొత్తవారిని నియమిం చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అయితే ఒక్కొక్క నియోజకవర్గం నుండి ముగ్గురు, నలుగురు పోటీపడుతుండడం వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకరిని కాదని మరొకరికి అవకాశం కల్పిస్తే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని గ్రహించిన అధినేత అచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారన్నారు. అయితే ఎవరికీ ఇన్‌చార్జి పదవి కట్టబెట్టినా మిగతావారందరు కలిసి కట్టుగా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయని గుర్తించాలని నేతలకు హితబోధ చేస్తున్నారు. తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదని ఆయన నేతలకు, శ్రేణుల్లో భరోసానింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల పార్టీ నుండి కొంతమంది సీనియర్లు వెళ్లిన స్థానాల్లో యువకులను ప్రోత్సాహించాలని నిర్ణయించారు. దీని ితోడు రానున్న సాధారణ ఎన్నికల్లో యువకులకు 33 శాతం, బడుగులకు వందసీట్లు ఇచ్చి ప్రోత్సాహించాలని నిర్ణయించడం తో ప్రజల్లో పార్టీకి కొత్త ఊపు వచ్చిందని అంచనా వేస్తున్నారు. అ లాగే మహిళలకు, మైనార్టీలకు పెద్దపీట వేయాలని యోచిస్తు న్నారు. పార్టీ ప్రతిష్ట దిగజార్చే పనులకు ఎవరు పాల్పడవద్దని తమ్ముళ్లకు చంద్రబాబు సూచిస్తున్నారు.
Posted by
arjun
at
12:15 AM