June 30, 2013
ఎన్టీఆర్ కడుపున పుట్టడం పూర్వ జన్మ సుకృతం

మహానటుడు నందమూరి తారకరామారావు కడుపున జన్మించడం తన అదృష్టమని బాలకృష్ణ
వ్యాఖ్యానించారు. తన తండ్రి జీవితమే తనకు స్ఫూర్తిదాయకమని ఆయన
పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలయ్య ఫిలడెల్ఫియాలో
డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ
కార్యక్రమంలో నందమూరి హీరోను లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ తో పురస్కరించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణతోనే తాను ఇంతటి
వాణ్ణయ్యానని వినమ్రంగా చెప్పారు. వారికోసం ఇకపైనా సినిమాల్లో
కొనసాగుతానని, ఫ్యాన్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు.
ఇక రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని,
అవినీతిని అంతమొందించేందుకు ప్రవాసాంధ్రులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
ఈ సభలో సినీతారలు హంసనందిని, రజిత, సంగీత దర్శకుడు మణిశర్మ, గాయని సునీత,
రచయిత వడ్డేపల్లి కృష్ణ, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు
పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
10:11 PM