తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు దొంగల్లా శాసనసభలో కూర్చున్నారని
తెలుగుదేశం సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు.
టిఆర్ఎస్ సభ్యులు అనూహ్యంగా సభలో ప్రశాంతంగా కూర్చోవడంపై ఆయన ఆశ్చర్యం
వ్యక్తం చేస్తూ కాంగ్రెస్,టిఆర్ఎస్ ల మాచ్ ఫిక్సింగ్ బట్టబయలైందని అన్నారు.
కెటిఆర్ దందాలను పక్కదారి పట్టించేందుకే శాసనసభలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
తెలంగాణవాదాన్ని పక్కనబెట్టారని ఆయన అన్నారు.కెసిఆర్ కుటుంబం నిజాంను
తలపిస్తోందని ఆయన అన్నారు.