May 5, 2013
టీడీపీ మండలి పక్ష నేతగా యనమల

అంతకుముందు శాసనమండలి సభ్యుడుగా చైర్మన్ కార్యాలయంలో యనమల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ- చట్టసభల గౌరవం పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. మండలి కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంపై నిషేధం తొలగింపునకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావుకు పార్టీ రాజకీయ జీవితాన్నిచ్చిందని, కేబినెట్ హోదాగల ప్రతిపక్ష నేత పదవితో గౌరవించిందని గుర్తుచేశారు. ఇన్నేళ్లుగా ఇలా ఆదరించిన పార్టీని వదిలి, అధినేతపై విమర్శలు గుప్పించడం ఆయన స్థాయికి తగదన్నారు.
Posted by
arjun
at
6:17 AM