May 22, 2013
పదవి కోసమే కేసీఆర్‌తో కడియం దోస్తి?

నాగం జనార్ధన్‌రెడ్డి, దేవెందర్ గౌడ్‌లను రెచ్చగొట్టి పార్టీనుంచి పంపించిన నీవు పార్టీని ఎందుకు వీడలేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవికి ఆశపడి పార్టీలో ఉన్న విషయం వాస్తవం కాదా అని అన్నారు. కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శించి కుటుంబ పాలన అని అన్న నీవు ఇప్పుడు అదే పార్టీలో ఎందుకు చేరావన్నారు. తెలంగాణపై టీడీపీకి స్పష్టత లేదంటూ పదే పదే అం టున్న కడియం, షిండేకు పార్టీ తరుపున స్క్రిప్టు రాసింది నీవు కాదా అన్నారు. అఖిల పక్ష సమావేశం తర్వాత టీడీపీ లేఖను షిండే మినిట్స్ రాసుకున్నాడని, తెలంగాణపై పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని బాబును పొగిడిన నీవు ఇప్పుడు విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
తెలంగాణపై పార్టీ తరుపున రెండో తీర్మా నం చేయాల్సిన అవసరం లేదన్న కడియం, ఇప్పుడు మహనాడులో తెలం గాణపై తీర్మానం చేయాలని ఎలా అడుగుతున్నాడో అర్ధం కావడంలేదన్నారు. అప్పుడో మాట ఇప్పుడో మాటతో ద్వంద్వ విధానం సరికాదన్నారు. టీడీపీ అధి కారంలోకి రాదని పార్టీ వీడావా, లేదా స్టేషన్ ఘన్‌పూర్ మరోసారి ఓటమి తప్ప దనే భయంతో వెళ్లావా అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎలాంటి పదవులు ఆశించకుండా ఉద్యమం చేస్తే కడియం శ్రీహరిని ప్రజలు నమ్ముతారని లేక పోతే రాజకీయ పతనం కాక తప్పదని ఎర్రబెల్లి జోస్యం చెప్పారు.
Posted by
arjun
at
10:54 PM