May 28, 2013
రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన నామా
ఆమ్ ఆద్మీ పేరుతో అధికారంలోకి
వచ్చిన కాంగ్రెస్ నేతలు 75 లక్షల కోట్లపైన దేశాన్ని దాటించేసారని నామా
లెక్కలేసారు. నల్లధనం కుబేరుల్లో కాంగ్రెస్ నేతలు ఉండడం వల్లనే ఆ జాబితా
బయట పెట్టడం లేదని ధ్వజమెత్తారు. ఇక నల్లధనంపై శ్వేత పత్రం విడుదల చేయాలని
పార్లమెంటును స్థంభింపజేశామని ఆయన గుర్తు చేశారు.
2008 లోనే
తెలంగాణా మీద స్పష్టత చేసిందని పేర్కొన్న నామా తెలంగాణపై టీడీపీ చిత్త
శుద్దితో పనిచేసిందని తెలిపారు. సామాజిక న్యాయం అంటూ వచ్చిన పార్టీ పుట్టుక
నాడే భూస్థాపితమైందని చిరంజీవికి చురకలంటించారు. ఇక జగన్ కోసం తీహార్ జైలు
తలుపులు తెరిచే ఉన్నాయని, ఆ పార్టీ కూడా కాంగ్రెస్ లో కలిసిపోవడం
ఖాయమన్నారు.
Posted by
arjun
at
8:49 AM