May 2, 2013
ఉద్యోగ, కార్మికులకు డిక్లరేషన్ : బాబు

అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇళ్ళు, వారి పిల్లల చదువులకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో సంఘం అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ప్రసంగించారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో పరిశ్రమలను, విద్యాసంస్థలను అభివృద్ధి చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా తయారైందని ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికులకు మేలు జరగాలన్న ఉద్దేశంలో భాగంగా 'నాక్(నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్)' సంస్థను ఏర్పాటు చేశామన్నారు.
భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.1,150 కోట్లను వాడుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, ఆ డబ్బును కార్మికులకే వ్యయం చేయాలని డిమాండ్‌చేశారు. 'ఆ రోజు చంద్రబాబు కూడా భూములనిచ్చారంటూ వైసీపీ నాయకురాలు విజయమ్మ ఆరోపిస్తున్నారు. కానీ పరిశ్రమలు స్థాపించని పక్షంలో భూములను వెనక్కు తీసుకుంటామన్న నిబంధనతోనే సెజ్‌లకు భూములనిచ్చాం. ఆ రోజు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టాం.
కానీ దొంగలు దోచుకోవడానికి కాదు. అయితే ఆ తర్వాత ఆ దొంగలే దోచుకున్నారు' అని చంద్రబాబు వెల్లడించారు. సభలో పార్టీ నాయకులు నన్నపనేని రాజకుమారి, తీగల కృష్ణారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, మండవ వెంకటేశ్వరరావు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, టీడీ జనార్ధన్‌రావు, లాల్ జాన్‌బాషా, పెద్దిరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, జైపాల్‌యాదవ్, శోభాహైమావతి, అరవింద్‌కుమార్ గౌడ్, టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాంతారెడ్డి తదితరులు ప్రసంగించారు. కాగా, ఏపీపీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితిని సడలించాలని చంద్రబాబు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఈ మేరకు సీఎం కిరణ్‌కు ఒక లేఖ రాశారు.
Posted by
arjun
at
2:46 AM