April 16, 2013
సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపుపై విచారణ: ముద్దు
హైదరాబాద్:ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధులను పులివెందుల, పీలేరు నియోజకవర్గాల్లో
రహదారులు, భూగర్భ డ్రైనేజీ పనులకు మళ్లించారని ఆయన ఆరోపించారు. దీనిపై
విచారణ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుని పదేపదే వాకింగ్ ఫ్రెండ్‌గా
అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇందిరమ్మ బాట, అమ్మ హస్తం పేరిట
ముఖ్యమంత్రి గాలి (విమానం)లో తిరుగుతున్నారని, ఆయన ఓ ఫ్లయింగ్ సీఎం అని
అభివర్ణించారు.ఇందిరమ్మబాటకి ప్రజలను బలవంతంగా అధికారులు బస్సుల్లో తరలిస్తన్నారని గాలి ఆరోపించారు. కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో కాంట్రాక్ట్ కార్మికులను నియమించవద్దని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, రాష్ట్రంలో మూడు లక్షల మంది పొరుగుసేవలు, ఒప్పంద కార్మికులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. చట్ట విరుద్ధంగా చేస్తున్న ఈ నియామకాలకు అనుమతి ఇస్తున్న ముఖ్యమంత్రిని జైలులో పెట్టాల్సి ఉంటుందని ముద్దుకృష్ణమ హెచ్చరించారు.
Posted by
arjun
at
10:56 PM