April 30, 2013
జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులు : మోత్కుపల్లి

కేసీఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కేసీఆర్‌తో తెలంగాణ రాదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కేసీఆర్ కాంగ్రెస్‌కు అమ్ముకుంటారన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు.
సీబీఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు
Posted by
arjun
at
7:26 AM