April 27, 2013
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు: రేవంత్ రెడ్డి
విశాఖపట్నం'రాష్ట్రం ఈ దుస్థితికి రావడానికి కారణం సీఎం కిరణ్, జగన్, కేసీఆర్' అని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం ఒక మూర్ఖుడని, ఆయన టీమ్‌లో ఉన్నవారంతా 420లే అని వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ ఒక జైలు పార్టీ అని ఆయన అన్నారు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన జగన్ కేడీ నెంబర్ వన్ అని ఆయన తెలిపారు. రాజకీయ పరిజ్ఞానం లేని షర్మిల సవాలు 'వానపాము బుసలు కొట్టడం వంటిదని' ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమాల పేరుతో విద్యార్థులను, ప్రజలను బుట్టలో వేసుకుని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నారని ఆయన అన్నారు.
Posted by
arjun
at
7:34 AM