March 31, 2013
చీకటి చింతల్లో పల్లెలు!

ఆడపడుచులకు విలువనిచ్చిన పార్టీ, ప్రభుత్వం మాది. ఇప్పుడు వాళ్లు అన్నివిధాల చీకట్లోనే మగ్గుతున్నారు. రూపాయిని పొదుపు చేయడం నేర్పి వారిని మహాలక్ష్ములను చేద్దామని నాడు నేను చూస్తే, లక్షాధికారులను చేస్తామంటూ ఆ పెద్ద మనిషి వాళ్లను భిక్షాధికారులను చేసి పోయాడు. ఇంద్రపాలెంలో జరిగిన ఆత్మీయ సమా వేశంలో మహిళల గోడు ఇదే. డ్వాక్రా మహిళలుగా..ఇప్పుడు ఆర్థిక లబ్ధినే కాదు,
కనీసం ఆత్మగౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నామని వాపోయారు. ఆడపిల్ల మైనస్ కాదు, ప్లస్ అని చాటాలన్న తాపత్రయం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకునేలా చేసింది. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాలూ లేవు.. ఆ కళా లేదు. చాలీచాలని కూలీ, మొగుడి తాగుడు కోసం తాకట్టుకు పోయే తాళి.. గ్యాస్‌బండ నుంచి ధరలకొండ వరకు వాళ్ల జీవితమే ఒక ఎగతాళి..!
Posted by
arjun
at
9:44 AM