March 16, 2013
మందు.. బాబు.. పకపకా!
హైదరాబాద్ : చంద్రబాబు నవ్వారు. మామూలుగా కాదు... పకపకా నవ్వారు.
తన సహజ సిద్ధమైన గాంభీర్యాన్ని పక్కన పెట్టి చిరునవ్వులు నవ్వడం అలవాటు
చేసుకున్న ఆయన... ఈసారి ఆపుకోలేనంతగా నవ్వారు. శనివారం పశ్చిమ గోదావరి
జిల్లా పైడిపర్రు గ్రామంలో... తణుకు, ఉంగుటూరు నియోజకవర్గాల కార్యకర్తలతో
జరిగిన సమీక్షలో సత్యనారాయణ అనే కార్యకర్త 'సీసా' బద్దలుకొట్టినట్లు
మాట్లాడిన వైనమే ఆయనను అంతగా నవ్వించింది. వారి మధ్య సాగిన సంభాషణేంటో
చదవండి.
సత్యనారాయణ అనే కార్యకర్తతో బాబు మాటా మంతీ...
చంద్రబాబు: మైకు ఆ తమ్ముడికి ఇవ్వండి. ఉత్సాహంగా ఉన్నాడు. ఏం తమ్ముడూ టిఫిన్ చేశావా?
కార్యకర్త: చేశాను సార్.
చంద్రబాబు: ఏం తిన్నావ్?
కార్యకర్త: ఇడ్లీలు తిన్నాను.
చంద్రబాబు: (కార్యకర్తలో ఏదో తేడా ఉన్నట్లు గమనించి...) ఇడ్లీలు తిన్నాక ఏం చేశావు?
కార్యకర్త: మందేశాను!
(అంతే..బాబు నవ్వు ఆపుకోలేకపోయారు. పగలబడి నవ్వారు)
చంద్రబాబు: తమ్ముడూ... మందు ఎక్కడ తాగావు. బెల్టు షాపులోనే కదా! వాటిని ఎత్తివేస్తే మందు మానేస్తావా!
కార్యకర్త: మీ మీద ఒట్టు సార్! బెల్టు షాపులు తీసేస్తే మందు మానేస్తా!
చంద్రబాబు: నామీదే ఒట్టేస్తున్నావా! (నవ్వుతూ) అధికారంలోకి రాగానే రెండో సంతకం ఆ ఫైలు మీదే పెడతాను.
Posted by
arjun
at
10:55 PM