February 20, 2013
క్రమశిక్షణకు మారుపేరుగా...

ఎన్నికల కమిషన్ ఆదేశాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావును అడిగి తెలుసుకొన్న చంద్రబాబు వాటిని తూచ తప్పకుండా పాటించారు. సాయంత్రం ఐదు గంటల వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉన్నా నాలుగు గంటలకే ముగించి ఈసీ సూచించిన విధంగా పార్టీ నాయకులకు వీడ్కోలు చెప్పి బస్సులోకి వెళ్లిపోయారు.ఆయన వెంట ఉండే వ్యక్తిగత సహాయకులు కూడా ఈసీ ఆదేశాలను పా టించారు. చంద్రబాబు బస చేసిన శిబి రం వద్ద పార్టీ జిల్లా నాయకులు ఉం డగా వారిని కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. సాయంత్రం 4.30 గంటలకు పార్టీ నాయకులంతా చంద్రబాబు బస చేసిన శిబిరం వదిలి వెళ్లిపోయేలా చేశారు. అనంతరం ఆ ప్రాంగణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులను మినహా మరెవ్వరిని లోపలికి అనుమతించ వద్దన్న ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారు. చంద్రబాబుకు 60 మంది పోలీసుల భద్రత: డీఎస్‌పీ ప్రసాద్
జడ్ ప్లస్ స్పెషల్ కేటిగిరీలో ఉన్న చంద్రబాబుకు పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్‌పీ వైటీఆర్ ప్రసాద్ తెలిపారు. ఈసీ ఆదేశాల మేరకు వేమూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారని, ఆయనకు నిబంధనల ప్రకారం బందోబస్తు కల్పిస్తున్నామని చెప్పారు. తన పర్యవేక్షణలో ఇరువురు సీఐలు, 60 మంది కానిస్టేబుళ్లు 24 గంటలు పహారా కాస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు చంద్రబాబును కలుసుకొనేందుకు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉందని, మరే ఇతరులు కలవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Posted by
arjun
at
10:20 PM