February 26, 2013
పేదలకు కూడు.. గూడు..

రేపల్లె నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలైన అరవపల్లి, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపా లెం, బొబ్బర్లంక తదితర గ్రామాల్లో పాదయాత్రను కొనసాగించిన చం ద్రబాబు మంగళవారం మరి కొన్నింటి లో కొనసాగించి బుధవారం కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టే దిశగా ముం దుకు సాగుతున్నారు. చంద్రబాబు ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలకు ఇప్పటివరకు 9 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి గురించి చెబుతూ తాను అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలను పూస గుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రజలు కూడా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై స్పందిస్తున్నారు. ప్రధానంగా తాగునీరు, వ్యక్తిగత మ రుగుదొడ్ల సమస్యలను ప్రస్తావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తా ను కూడు, గుడ్డ, నీడ ప్రాధాన్యాంశాలుగా అమలు చేస్తానని హామి ఇస్తున్నారు.
కాంగ్రెస్, వైసీపీలపై చంద్రబాబు తన ఆరోపణల పరంపరను కొనసాగించారు.
కాంగ్రెస్ నాయకులు దు ర్మార్గులని, సేవాభావం లేకుండా ప్రజలను దోపిడీ చేయడమే పనిగా పెట్టుకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నీతిని ప్రభోదించేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొన్ని సంఘటనలను ఉదహరిస్తున్నారు. రేపల్లెలో ఓటమిపాలైన టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ సేవాభావంతో ముందుకెళుతూ ప్రజల మధ్యన ఉంటే గెలిచిన మోపిదేవి జైలు పాలయ్యాడని చెబు తూ ఎవరు నీతిమంతులో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్ ఖా తా నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడుల రూపంలో ఓబుళాపురం గనుల అవినీతి పారింది. అలాంటి గాలితో స్నేహం చేసిన వీళ్లు అధికారంలోకి వస్తే ఇంటి పైకప్పు కూడా ఉండకుండా చేస్తారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
రైతుల కడుపుమంట చూసి నేను ప్రభుత్వంపై తిరుబాటు చేయాలని చెప్పాను. కృష్ణా పశ్చిమ డెల్టాకు రెండో తడి ఇవ్వమని 20 రోజులుగా గొంతెత్తి డిమాండ్ చేస్తున్నాను. అయినా స్పందించకపోవడంతో రైతు లు పొలం పనికి ఉపయోగించే కత్తి, కొడవలితో రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిస్తే నాపై కేసులు పెడతానికి సిద్ధమయ్యారు. వాళ్ల బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు నేను భయపడేది లేదు. ముందు సాగునీరు ఇచ్చి ఆ తర్వాత కేసులు పెట్టుకోండి. రైతుల కోసం నేను ఎలాంటి కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉ న్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైఎస్ ఒక పులిలాంటి వాడు అడవిలో ఉన్న ఒక పులి మనుషులను తినడం మరిగింది. ఆ పులి మ నుషులను తేలిగ్గా తినేయాలని తన కాలికి ఒక బంగారు కంకణం కట్టుకొంటుంది. తన వద్దకు వస్తే అది ఇస్తానని చెప్పి మనిషి రాగానే అతన్ని చంపేసి తినేస్తుంది. వైఎస్ కూడా అదే పని చేశాడు. కేజీ రూ.2 బియ్యం, ఆరోగ్యశ్రీ ఆశ చూపించి రాష్ట్ర ప్రజలను మింగేశాడు. శుష్క వాగ్దానాలు చేసి రూ. లక్ష కోట్లు వెనకేసుకొన్నాడు. ఈ విషయంలో ప్రజలకు ఒక స్పష్టత రావాల్సి ఉందని చంద్రబాబు పొడు పు కథ ద్వారా రేపల్లె శివారు గ్రామా ల ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
ప్రధాని మీనమేషాలు లెక్కిస్తున్నారు కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదు లు పేట్రేగిపోతున్నారు. హైదరాబాద్‌లో మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీపార్కు, దిల్‌షుక్‌నగర్‌లో బాంబులను పేల్చి వందలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకొన్న ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చి కూడా మరలా బాంబు పేలుళ్లు జరగకుండా గట్టి చర్యలు చేపడతామని చెప్పలేకపోతున్నారంటే ప్రజల రక్షణకు ఈ ప్రభుత్వం ఏపాటి ప్రాధాన్యం ఇస్తుం దో గమనించాలని చంద్రబాబు చెబుతున్నారు.
మహిళల నీరాజనాలు చంద్రబాబు పాదయాత్ర సాగిన అరవపల్లి, ఊరుపాలెం, నల్లూరుపాలెం, సింగుపాలెం, విశ్వేశ్వరపాలెం, బొబ్బర్లంక, కనగాలవారిపాలెంలో మహిళలు నీరాజనాలు పలికారు. ది ష్టి గుమ్మడికాయతో ఎదురొచ్చి చంద్రబాబుకు దిష్టి తీసి కర్పూరంతో హారతిచ్చి నుదుటిన తిలకం అద్ది దీవించారు. చంటిపాపలను చంద్రబాబు వద్దకు తీసుకొచ్చి నామకరణం చే యించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ, తెలుగు మహిళలు ము లకా సత్యవాణి, కేసనశెట్టి రామశాంతాదేవి తదితరులు చంద్రబాబు పాదయాత్ర జరిగే గ్రామాలకు ముందుగానే వెళ్లి మహిళల్లో చైతన్యం నింపుతున్నారు. ఇదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నగర నేతలు ముత్తినేని రాజేష్, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్ యువతను చైతన్యవంతం చేస్తున్నారు.
Posted by
arjun
at
5:34 AM