February 24, 2013
స్ఫూర్తి ప్రదాతలు అంబేద్కర్, ఎన్టీఆర్

బీసీల కోసం పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయనున్నట్లు, రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు రిజర్వు చేశామన్నారు. భట్టిప్రోలు మండలంలో చేనేత, గౌడ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అక్కడి నుం చి పాదయాత్ర పల్లెకోనకు చేరుకుంది. పల్లెకోన సెంటర్‌లో ప్రజలనుద్ధేశించి బాబు మాట్లాడుతూ గౌడ కార్మికుల పొ ట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తాను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను రద్దు చేయటంతోపాటు గౌడల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు శనివారం భట్టిప్రోలు మండలానికి తరలివచ్చారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కాకతీయ యూత్ పది వాహనాల్లో భట్టిప్రోలు చేరుకుని చంద్రబాబుతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు, మెదక్ జిల్లా సదాశివపేట మండలం నుంచి పార్టీ నాయకులు అబ్దుల్ ఖాదిర్, హైటెక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు భట్టిప్రోలు తరలివచ్చి బాబు పాదయాత్రలో పాల్గొన్నారు.
వేమూరి ఆనందసూర్య ఆధ్వర్యంలో, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం ప్రముఖులు సుమారు 150 మంది బ్రాహ్మణ ప్రముఖులు మూడు బస్సుల్లో వచ్చి కోనేటిపురంలో చంద్రబాబుతో భేటీ అ య్యారు. కార్యక్రమంలో జిల్లా నా యకులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, మన్నవ సుబ్బారావు, జియావుద్దీన్, శనక్కాయల అరుణ, చిట్టిబాబు, దానబోయిన శ్రీనివాస్‌యాదవ్, స్థానిక నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:49 AM