February 13, 2013
లక్ష కోట్లు దోచాడనా.. వైఎస్‌కు లక్ష విగ్రహాలు?
వాళ్లు నీతిమంతులా?
అలా అంటే మల మూత్రాలు పడేలా తంతారు!
నా ఇల్లు, జగన్ ఇల్లు చూసి..
అవినీతిపరులెవరో తేల్చండి
అసలు ఈయనేం ముఖ్యమంత్రో?
రాష్ట్రానికి 'కాంగ్రెస్' చెదలు వదిలించాలి
తొలి రోజే వస్త్ర వ్యాపారాలపై వ్యాట్ ఎత్తివేస్తా
రెండు వేల కిలోమీటర్ల నడక పూర్తి
- గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి ఎందరో చేసిన త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. అలాంటిది రూ.లక్ష కోట్లు కొడుక్కి దోచిపెట్టిన వైఎస్‌కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం?'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్‌ను ఎవరూ ఆదర్శంగా తీసుకోరాదని కోరారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ర్రాష్టానికి చెదలు పట్టిందని, సర్వనాశనం చేస్తున్న ఆ పార్టీని పూర్తిగా వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పట్టణం ఏటుకూరు రోడ్డు డీఎస్ నగర్‌లో మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు.
"ఈ కిరికిరి సీఎం రూపాయికి కేజీ బియ్యం అన్నాడు. మొన్న సన్నబియ్యం రూపాయికే అన్నాడు. మరునాడే మాటమార్చి మంచి బియ్యం అని చెప్పాడు. అంటే ఇప్పటిదాకా ఇచ్చింది చెడ్డబియ్యమేకదా?'' అన్నారు. ఆడపిల్లల హ క్కులు, రక్షణ బాధ్యత తీసుకొంటానని వాగ్దానం చేశారు. కామాంధులకు ఉరి శిక్ష వేయిస్తానని పునరుద్ఘాటించారు. బెల్టుషాపులకు తలుపులు తెరిచి ఆడబిడ్డల మంగళసూత్రాలతో ఈ ప్రభుత్వం ఆడుకొంటోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కరెంటు బాంబులేసి 10 లక్షల చిన్న పరిశ్రమలను దివాలా తీయించిం దన్నారు.
లక్షలమంది పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశా రు. తాను నీతిమంతమైన పాల నతో జవాబుదారీగా నిలిస్తే వైఎ స్ రాక్షసపాలనగా మార్చేశాడని నిప్పులుచెరిగారు. బెంగళూరు, లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల, కడప, చెన్నైలో ప్యాలెస్‌లు నిర్మించి, వాటిని దె య్యాలు కాపురం ఉండే కొంపలుగా తయారుచేశారన్నారు. వస్త్ర వ్యాపారంపై వ్యాట్‌ను అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రూ.20-30 లక్షల మధ్య టర్నోవర్ ఉన్నవారికి సెల్ఫ్ అసెస్‌మెంట్ అమలు చేస్తానన్నారు. ఎఫ్‌డీఐలతో 4కోట్ల మంది చిరు వ్యాపారుల జీవితాలు చితికిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.
19న విరామం
గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో కోడ్ కారణంగా 19న సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు పాదయాత్రను వేమూరు నియో జకవర్గంలో నిలిపేస్తారు. తిరిగి 21 సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. దీంతో 17న ఆదివారం విరా మం ఉండదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లా రావు తెలిపారు. కాగా, చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ ని అధికారంలోకి వస్తే అమలు చేస్తామని పార్టీ నేత దాడి వీరభద్ర రావు హైదరాబాద్‌లో ప్రకటించారు.
Posted by
arjun
at
7:58 AM