January 24, 2013
ఈ ప్రభుత్వ తీరింతే..మార్పును కోరుకోండి

* అయ్యా.. ఏమని చెప్పుకోను నా బాధ. నీకు ఇంటి స్థలం లేదు పో అని అధికారులు అన్నారు. అవినీతి మా ఊళ్ళో కూడా ఉంది. నేను ఒక్కటే నిర్ణయానికి వచ్చా.. ఈ సారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నా.:- యాదగిరి, లారీ డ్రైవర్ చంద్రబాబు : తమ్ముడూ.. నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే! కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోవటం లేదు. పెద్దలకు దోచి పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి అనేకం టీడీపీ హయాంలో నెలకొల్పినవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది * మీరు సీఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని సినిమాల్లో చూపించేవారు. ఇప్పుడు జరుగుతున ్న అవినీతి వ్యవహరాలపై సినిమాల్లో చూపిస్తున్నారు. ఈ సారి తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. లక్ష కోట్లు పారేస్తే గెలుస్తాం అన్న అభి ప్రా యంలో వైసీపీ నాయకులు ఉన్నారు.
:- ప్రసాద్, స్థానికుడు చంద్రబాబు : తమ్ముడూ నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. ఎవరెన్ని అధర్మ మార్గాల్లో వెళ్ళినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే! నేను చేసే పోరాటానికి మీరు సహకరించండి! మీ సెల్‌ఫోన్స్ ద్వారా అవినీతిపై వ్యతిరేకంగా ఒక్కొక్కరూ 10 ఎస్ఎంఎస్‌లు పంపించండి చాలు. ఏం జరుగుతుందో చూడండి.* సార్.. నేనొక్కడినే లోటస్ పాండ్‌కు వెళ్ళాలనుకుంటున్నాను. పాండ్ కింద దాచిన లక్ష కోట్లు మన సొమ్మే కదా! నాతో పాటు ఎవ్వరు వచ్చినా సరే..తవ్వి తీస్తాం .
:- నరేంద్ర, యువకుడు చంద్రబాబు: తమ్ముడు నువ్వు చెప్పింది వాస్తవం. రాజశేఖరరెడ్డి పరిపానలో రాష్ట్రాన్ని దోచేశారు. రౌడీ రాజకీయాలతో అరాచక పాలన సాగించారు. వారు దిగమింగిన లక్ష కోట్లను బయటకు తీస్తే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టవచ్చు.
నేనిప్పుడు చేసే పోరాటం అదే.* అయ్యా.. నా ఇంటి గోడ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కాదని నాకు ఎలాంటి సహాయం చేయడంలేదు. అదే వారి పార్టీకి చెందిన వారికైతే.. పనిచేసుకుంటున్నారు.:- అప్పన్న రమాదేవి , మేస్త్రీ చంద్రబాబు : చూడు తల్లీ.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి రూ. లక్షతో ఇంటిని కట్టిస్తాం. అలాగే ఇళ్ళ స్థలాలు లేని వారికి వాటిని కూడా అందిస్తాం. మీ జీవితాలు బాగు పడటానికి పంట రుణాలను మాఫీ చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.
Posted by
arjun
at
5:13 AM