December 30, 2012
పల్లె పల్లెనా ఢిల్లీ దుఃఖమే!

రాఘవరెడ్డి పేటలో కొం దరు మహిళలు ఈ సంఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నిరసన తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎక్కడో ఢిల్లీలో జరిగిన దారుణంపై ఇంత మారుమూల
గ్రామంలో కూడా స్పందన రావడం ఆశ్చర్యం కలిగించింది. ఆడపడుచుల కన్నీటివరదలో ఈ కీచక కాంగ్రెస్
కొట్టుకుపోయే రోజు వచ్చి తీరుతుందనిపించింది. ఇంత నీచమైన అనాగరికమైన చర్య జరిగితే
ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదు.
టేకుమట్ల, రాఘవరెడ్డి పేటల్లో జరిగిన బహిరంగ సభల్లో రెండు నిమిషాలు మౌనం
పాటించాం. ఆమెకు ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించాను. దుబ్యాలలో కొందరు
రైతులు పత్తి బస్తాలను తీసుకొచ్చి రోడ్డుపై వేసి నా కోసం ఎదురుచూడటం కనిపించింది.
వాళ్లను పలకరించాను. తెల్ల బంగారం పండించినా తమ బతుకుల్లో మార్పు లేదని వారంతా ఆవేదన
వ్యక్తం చేశారు.
" సార్..తెగులు రావడంతో ఆరుసార్లు పురుగులమందు కొట్టాను. అయినా దిగుబడి
రాలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే తలావెయ్యి రూపాయలు వేసుకొన్నాం. అయినా అధికారులు
పలకడం లేదు. పున రుద్ధరించమని కోరి మూడు నెలలు దాటుతున్నా ముఖం చాటేస్తున్నారు. ఇక
మేం ఏమి చేయాలం''టూ వారంతా వాపోయారు. అక్కడ నుంచి కదులుతుండగానే.. రాఘవరెడ్డి పేట దారిలో
లంబాడా హక్కుల పోరాట సమితి ప్రతినిధులు పెద్దఎత్తున తరలివచ్చి నాకు సంఘీ భావం తెలిపారు.
ఇలాంటి వాళ్ల అభిమానమే కదా నన్ను నడిపిస్తోంది!
Posted by
arjun
at
6:55 AM