ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తా
నిజాయితీని నిరూపించుకుంటా
సంకల్పం పూనిన చంద్రబాబు
నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ వద్ద
వెయ్యి కిలోమీటర్లు పూర్తి
సంబరాలు చేసుకున్న కార్యకర్తలు
నా మాటల్లో నిజం ఉంటేనే మద్దతివ్వండి
మాదిగలకు వైసీపీ వ్యతిరేకం
పాదయాత్రలో చంద్రబాబు

నిజామాబాద్, డిసెంబర్ 3 : "ఎన్టీఆర్ విగ్రహాలను చూస్తే ఆదర్శం. వైఎస్
విగ్రహాలను చూస్తే అవినీతి గుర్తొస్తుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు
అన్నారు. రాజశేఖరరెడ్డి వంటి తప్పుడు వ్యక్తుల వల్లే సమాజం దారి
తప్పుతోందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పాతసాలంపాడు
గ్రామం వద్ద చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
"ఉగ్రవాదం కంటే అవినీతే ప్రమాదకరం. రాష్ట్రంలో ఉన్న పార్టీలు లక్షల కోట్ల
ప్రజల సొమ్మును దోపిడీ చేశాయి. ఆ సొమ్ముతో అరాచకాలు చేస్తున్నాయి.
పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రజలు ప్రమాదక ర పరిస్థితిని
ఎదుర్కొంటారు. అందుకే ప్రజలను మేల్కొల్పడానికి, సమస్యలు తెలుసుకుని ధైర్యం
చెప్పడానికి పా దయాత్ర చేపట్టా''నని పెంటాఖుర్దులో జరిగిన 'వెయ్యి
కిలోమీటర్ల వేడుక సభ'లో చంద్రబాబు విశ్లేషించారు.

ఈ
గ్రామంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన
ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు.. ఓ మహావ్యవస్థ అని, సినిమా రంగంలోనూ
ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన మహా శక్తి అంటూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను చంద్రబాబు
నెమరు వేసుకున్నారు.
ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ వైఎస్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రైతు
రుణమాఫీని అడ్డుకున్న పాపం వైఎస్‌దేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దివాలా
తీయించాడని, తన కొడుకుకు ప్రజల సొమ్ము దోచిపెట్టాడని మండిపడ్డారు.
దీనివల్లే రాష్ట్రం అనా«థలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్
నేతలు అడవి పందుల్లా ప్రజల సొమ్మును దోపిడీ చేయడంతో పాటు వ్యవస్థలనూ
సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రజల ఆశీస్సులతోనే 1000 కిలోమీటర్లు
నడవగలిగానని చెప్పారు. తాను రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేస్తే
కాంగ్రెస్ పా ర్టీ పెరిగిన ఆదాయాన్ని దోపిడీ చేసి ప్రజలను సమస్యల వలయంలోకి
నెట్టేసిందని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో వైసీపీ మోసం
చేసిందని ధ్వజమెత్తారు. మాదిగలకు వైసీపీ వ్యతిరేకమన్న విష యం బయటపడిందని
చెప్పారు. ఎస్సీ వర్గీకర ణ విషయంలో ఇప్పుడు అన్ని పార్టీలు తమదారిలోకే
వస్తున్నాయని గుర్తు చేశారు. "వర్గీకరణ విషయంలో వైసీపీ మోసం చేసింది. ఆ
పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఓటు వేసి ఉం టే ప్రభుత్వం కూలిపోయేది.
నిన్నటివరకు అవిశ్వాసంపై టీడీపీని బదనాం చేసిన వైసీపీ ఇప్పు డు ఎందుకు
వెనక్కి తగ్గినట్టు? వారికి ఆ దమ్మూధైర్యం ఉందా? తల్లి కాంగ్రెస్, పిల్ల
కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయింది. జైల్లో ఉండే వ్యక్తిని సీఎంని చేస్తామని
చెప్పినా ప్రజలు చూస్తూ ఊరుకుంటా రా?'' అని ప్రశ్నించారు.
కేసులు ఎత్తివేసి జైలునుంచి విడుదల చేస్తే పార్టీని కాంగ్రెస్‌లో
కలపడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్
వంటివారు మాటల గారడి చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరునెలలు
కుంభకర్ణుడిలా నిద్రపోయే కేసీఆర్ నిద్రలేచి ప్రజలను ఏమార్చే ప్రయత్నం
చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పింది నమ్మితేనే మద్దతు ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు. "హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేసి లక్షల మందికి
ఉద్యోగాలు ఇచ్చాను. నేను చెప్పింది బాగా ఆలోచించి బాగుందనుకుంటే
ఆశీర్వదించండి. అనాథలా మారిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేసే అవకాశమివ్వండి''
అని కోరారు.