December 9, 2012
టీడీపీ హయాంలో డీఎస్సీలను ఓ జాతరగా జరిపాం

తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారి ఆవేదన అంతా ఇంతా కాదు. బీఈడీ చదువుకున్న వారికి ఎస్జీటీకి అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ చదువుకుని కూడా ఎస్జీటీ పోస్టుకు అర్హత లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తోందని మదన పడుతున్నారు. ఒక్క కలం పోటుతో ఈ ప్రభుత్వం ఆరు లక్షలమంది ఉసురు పోసుకుంటోంది.
ముస్లిములు ఉర్దూలో చదువుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. జనాభా ప్రాతిపదికన ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, టీడీ పీ హయాంలో భర్తీ చేసిందే ఆఖరు. ఉర్దూ టీచర్ పోస్టులు కూడా మెజారిటీ ఖాళీ. ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుని మరీ వాళ్లు ఆందోళన చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాల్సిందే! కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేస్తుందా!?
ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎస్సారెస్పీ నిర్వాసితులు వచ్చి కలిశారు. తమకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నిర్వాసితులు..! ఎన్నేళ్ల కిందటి మాట ఇది? వాళ్లకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వారిని రకరకాల వివాదాల్లోకి నెట్టేస్తోంది. వారికి వెంటనే పరిహారం ఇవ్వాలి. వారి ఉసురు పోసుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా!
Posted by
arjun
at
8:38 PM