December 19, 2012
21న కరీంనగర్‌కు బాబు పాదయాత్ర.....

ఈ సందర్భంగా గ్రామాల వారీగా నేతలకు పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను అప్పగించ డం జరుగుతుందని తెలిపారు. 21వ తే ది పదిగంటల ప్రాతంలో కరీంనగర్ ని యోజకవర్గంలోకి చేరుకుంటుందని, అక్కడే బస చేసకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 22వ తేది ఉదయం 10.30నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమై గ్రామంలోని పద్శశాలి సంఘం చౌరస్తా నుంచి బస్టాండ్, చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ స భ ఉంటుందని తెలిపారు. సభ అనంత రం గ్రామపరిధిలోని అల్ఫోర్స్ ఈటె క్నో పాఠశాలలో సివి రామన్ జ యంతి ఉత్సవా ల్లో పరిచయ కా ర్యక్రమాన్ని ము గించుకుని రేకుర్తి మీదుగా సీరాంపూర్ నుంచి ఆరపెల్లి గ్రామం తీగలగుట్టపల్లి గ్రా మానికి చేరుకుని బస్‌స్టేజ్ వద్ద రో డ్‌షోలో పాల్గొంటాడు.
రోడ్ షో అనంతరం సాయంత్రం పాదయాత్రలో పా ల్గొంటరని, తీగటగుట్ట పల్లె మీదుగా వ ల్లంపహాడ్, ఎలబోతారం క్రాస్ రోడ్డు నుంచి నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఆసుపత్రి మీదుగా జూబ్లీనగర్ ప్రజల తో కలుస్తూ చామనపెల్లి శివారులో ఏ ర్పాటు చేసిన బస చేసూ ప్రాంతానికి చే రుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. 23న ఉదయం 10.30గంటలకు 28వ తేదిన తెలంగాణ కోసం జరిగే అఖిలప క్ష సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం పాదయాత్ర చామనపెల్లి, దుబ్బపల్లి, చెర్లబూత్కూర్ మీదుగా మొగ్దుంపూర్ ఆతరువాత గర్రెపల్లి గ్రా మానికి పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
ఈ పాదయాత్రలో కొత్తపల్లి గ్రామంలోని చేనేత కార్మికులకు భరోసా ఇస్తాడని, వారి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలపై డిక్లరేషన్ ఇస్తాడని తెలిపా రు. ఈ యాత్రను విజయవంతం చే యాలని కోరారు. కరీంనగర్ నియోజక వర్గంలో జరిగే పాదయాత్రకు టీడీపీ తెలంగాణ పోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఆయన వెంట నాయకులు జంగిలి సాగర్, వాడె మధుసూదన్‌రెడ్డి, రుద్ర రాజు, బూస రాములు, జేరిపోతుల మొండయ్య, బోగ రవీందర్, శ్రీ«ధర్, ఆర్ఐ ఎండి ఖాజ, కార్యదర్శి సత్యనారాయణ, రూరల్ సీఐ కమలాకర్‌రెడ్డిలు ఉన్నారు.
Posted by
arjun
at
2:41 AM