November 27, 2012
కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు నా వ్యాన్‌లో ఉండేవాడు:చంద్రబాబు
కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. నేడు
నా వ్యాన్‌లో ఉండేవాడు
నాడు నా కన్నా బాగా 'దేశం' గురించి మాట్లాడేవాడు
వైఎస్ తెలంగాణను దోస్తున్నా పట్టించుకోలేదు
టీఆర్ఎస్ అధినేతపై చంద్రబాబు నిప్పులు
రాష్ట్రమంతటా ఓటేస్తేనే అధికారంలోకి వస్తా
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు ఎప్పుడూ సిద్ధమే
మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు
మీరు సహకరిస్తే కాంగెస్ర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా

మెదక్‌జిల్లాలో పదోరోజైన మంగళవారం పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. ప్రజలను కలుసుకుంటూ, వివిధ సభల్లో మాట్లాడుతూ 15.2 కి.మీ.ల దూరం నడిచారు. టీడీపీ లాంటి పేదలపార్టీని దెబ్బతీసేందుకు ఒక ప్రాంతంలో అవినీతిపరులు, ఉద్యమం పేరిట మరో ప్రాంతంలో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు.

పల్లెటూరుగా ఉండే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టాను. సైబరాబాద్‌కు, హైటెక్ సిటీకి రూపకల్పన చేశాను'' అని చెప్పుకొచ్చారు. వాన్‌పిక్ వ్యవహారంలో సీఎం కిరణ్ దొంగలకు కాపలా కాస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ చార్జిషీట్‌లో ఐదో ముద్దాయిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు జైలుకెళ్లకుండా కాపాడుతున్నారన్నారు. పైగా ధర్మాన తప్పేమీ లేదని కిరణ్ నిస్సిగ్గుగా చెబుతున్నారని మండిపడ్డారు. దొంగ కంపెనీలతో విదేశాలలో సైతం ఆస్తులు కూడబెట్టినందున జగన్ కేసు దర్యాప్తునకు మరో మూడు నెలలు కావాలని కోర్టును సీబీఐ కోరిందంటే జగన్ అవినీతి తతంగం ఎలా ఉన్నదో తెలుస్తున్నదని వ్యాఖ్యానించారు.

ఇంకా పదేళ్లలో ఉద్యోగాలు రాకపోతే మీరు ముసలి వాళ్లవుతారు. జీవితంపై నిరాశ కలుగుతుంది'' అని యువతను ఉద్దేశించి ఆవేదనతో అన్నారు. అయితే, తెలంగాణ అంశాన్ని తేల్చడం తన చేతుల్లో లేదని చెప్పారు. దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర, రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని దుయ్యబట్టారు. మరోవైపు కేంద్రాన్ని నిలదీయాల్సిన కేసీఆర్ తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఇదే జిల్లా అని చెప్పారు.
టీడీపీలోనే పని చేసినప్పుడు అందరికన్నా ఎక్కువగా పార్టీని గురించి బాగా మాట్లాడేవారని చెప్పారు. వైఎస్ అవినీతి గురించి ఆయన, టీఆర్ఎస్ ఏనాడూ మాట్లాడలేదని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 8 వేల ఎకరాలను అమ్మితే పట్టించుకోలేదని, కూతురికి వరకట్నంగా బయ్యారం ఖనిజ సంపదను లీజుకు ఇచ్చినా, జలయజ్ఞం పేరిట ధనయజ్ఞానికి పాల్పడినా టీఆర్ఎస్ స్పందించలేదని విమర్శించారు.
కాగా, తాము అధికారంలోకి వస్తే పేదవృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేసి, మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. మైనారిటీలలో ఎక్కువగా పేదలున్నారని వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థలు, చట్టసభల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వచ్చే ఎన్నికలలో మైనారిటీలకు పార్టీ నుంచి 15 స్థానాలలో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు.
Posted by
arjun
at
11:09 PM