గద్వాల్ సభలో శుక్రవారం రాత్రి గాయపడిన
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జూనియర్ ఎన్టీఆర్ శనివారం
ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న 'బాద్ షా' చిత్రం
షూటింగ్‌ను ఎన్టీఆర్ రద్దు చేసుకున్నారు. ఆయన వెంట దర్శకుడు శ్రీనువైట్ల,
నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఎన్టీఆర్
శనివారం ఉదయం గద్వాల్‌కు బయలుదేరి వెళ్లారు.
మహబూబ్‌నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో చంద్రబాబును పరామర్శించిన అనంతరం
ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ సభావేదిక కూలి గాయపడిన మామయ్య ఆరోగ్య
పరిస్థితిని తెలుసుకునేందుకు వచ్చానని, ఆయన త్వరగా కోలుకుని తిరిగి
పాదయాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. రాష్ట్రాన్ని గాడిలో
పెట్టిలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నానని
అన్నారు. షూటంగ్ తేదీలను వెసులుబాటు చూసుకుని తాను కూడా బాబు పాదయాత్రలో
పాల్గొనాలని భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
కాగా చంద్రబాబుకు ప్రమాదం జరిగిన వార్త తెలుసుకుని చెన్నైలో షూటింగ్‌లో
ఉన్న నారా రోహిత్, నారా గిరీష్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని గద్వాలకు
బయలుదేరారు. ఇప్పటికే దేశం సీనియర్ నాయకులు డాక్టర్ కోడెల శివప్రసాద్,
బొజ్జల తదితరులు గద్వాల చేరుకుని బాబుని పరామర్శించారు.
No comments :
Post a Comment