
టీడీపీ రాష్ట్ర
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రపై విమర్శలు చేసే
స్థాయి వైఎస్సార్‌కి లేదని విజయవాడ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని
వంశీ మోహన్ అన్నారు. మంగళ వారం లోకుమూడిలో విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టీడీపీ అధికారంలోకి
వస్తేనే ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం లభిస్తుందన్నారు. కాంగ్రెస్
అవినీతి పాలన ప్రజ లకు తెలియజేసేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను
విమర్శించే స్థాయి, అర్హత వైఎస్సార్ సీపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నామినేటెడ్ పదవుల
భర్తీకి చూపుతున్న మక్కువ ప్రజా సమస్యలపై చూపడం లేదని ఆరోపించారు.
కృష్ణాడెల్టాను ఎడారిగా మారు స్తున్నారని, శివారు ప్రాంతాలకు కాలువల ద్వారా
నీటిని నేటికి సక్రమంగా సరఫరా చేయలేదని, వర్షాధారం పంటలు పండుతున్నాయని,
కైకలూరు ప్రాంతంలో చేపల చెరువులకు నీరులేక మత్స్య పరిశ్రమ దెబ్బతినే
పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
చలమలశెట్టి రామానుజయ, పార్టీ కార్యదర్శి ఈడ్పుగంటి వెంకటరామయ్య, చల్లసాని
ఆంజనేయులు, కైకలూరు పార్టీ మండల అధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, రేమల్లే
విజయ బాబు, కుమారస్వామి, సుధ పాల్గొన్నారు.
No comments :
Post a Comment